రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం


Tue,September 11, 2018 02:23 AM

సంగెం, సెప్టెంబర్ 10 : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని రాంచంద్రాపురం గ్రా మంలో సోమవారం నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చిన నాగుర్లను కుల సంఘాలు, రైతు కమిటీ లు, అన్ని వర్గాల ప్రజలు గజమాలలు, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బోంపెల్లి దిలీప్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగుర్ల వెంకటేశ్వర్లు మా ట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నాయన్నారు. 24 గంటల ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనన్నారు. రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలు ఇచ్చి, పెట్టుబడి కోసం ఎకరానికి రూ.8వేల చొప్పున రెండు సార్లు ఇస్తూ అప్పుల బారిన పడకుండా ఆదుకున్నది సీఎం కేసీఆరేనన్నారు. రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందన్నారు.

బాధిత కుటుంబానికి వారం రోజుల్లో రూ.5 లక్షల బీమా అందజేస్తున్నట్లు వివరించారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు. ఎరువులు, విత్తనాలు కూడా ఎలాంటి కొరతలేకుండా అందుబాటులో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో కొత్త వంగడాలను, సాంకేతిక పరిజ్ఞానంతో విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రైతులు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కందకట్ల నరహరి, జిల్లా సభ్యులు పులుగు సాగర్‌రెడ్డి, ఎంపీటీసీలు కత్తి రాధిక, దొమ్మాటి సంపత్, ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బలేరావు మనోహర్‌రావు, జిల్లా అధ్యక్షుడు హింగె శివాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెండారాజేశ్, మల్ల య్య, కలింగరావు, కిషన్‌రావు, కౌడగాని శంకర్‌రావు, కిశోర్‌యాదవ్, మాజీ సర్పంచ్ సారయ్య, దోపతి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...