ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా..


Mon,September 10, 2018 03:18 AM

-రాజకీయం నేర్పింది నర్సంపేట డివిజన్
-ఎన్ని కుట్రలు పన్నినా టీఆర్‌ఎస్‌దే విజయం
-దొంతి, రేవూరి పాలనలో 20 ఏళ్ల వెనక్కి
-సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి
-నల్లబెల్లిలో గ్రామ దేవతలకు మొక్కి ఎన్నికల ప్రచారం
నల్లబెల్లి, సెప్టెంబర్ 09 : మడమ తిప్పని రాజకీయం, వెనుదిరగని గమ్యం, అలుపెరుగని పోరాటం, చావో రేవో తేల్చుకోవాలనే పట్టుదల.. ఇవన్నీ నల్లబెల్లి మండలంతో పాటు నర్సంపేట డివిజన్ నేర్పిన పాఠాలు అని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ వరించిన తర్వాత మొదటి సారిగా నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం వచ్చారు. దీంతో స్థానిక ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నాగమయ్య, కన్యాకాపరమేశ్వరి, గ్రామ దేవత బొడ్రాయి వద్ద పెద్ది ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగమ్మ గుడి ప్రాంగణంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ ధ్యేయంగా ఉద్యమం చేసినట్లు చెప్పారు. నాటి సమైక్య పాలకుల ఎత్తుకు పైఎత్తులు వేసి కుట్రదారుల నుంచి పార్టీని, ఉద్యమాన్ని కాపాడినట్లు తెలిపారు. నాడు ఇక్కడి ప్రజ లు ఇచ్చిన ఆత్మైస్థెర్యం తనను ముందుకు నడిపించిందన్నారు.

నేటికీ కేసీఆర్‌తో ఉన్న చనువుతో ఎన్నో నిధులు తెచ్చి నర్సంపేట డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేశానన్నారు. రోడ్లు, భవనాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల ఆజామాయిషి ఎమ్మెల్యే చేతుల్లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి కనపడకూడదని వాటన్నింటిని తుంగలో తొక్కారని ఆరోపించారు. అయినా నర్సంపేట డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో రోడ్ల కోసం నిధులు తెస్తే కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు పనులు చేయలేదన్నారు. రంగాయ చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో చెరువు మాధవరెడ్డి, కాలువలు ప్రకాశ్‌రెడ్డి పేర్లు రాయించుకొని అడుగు ముందుకు వేయని దుస్థితికి తీసుకువచ్చినా ఒక్క ఎకరం మునగకుండా రిజార్వాయర్‌ను నిర్మిస్తున్నామన్నారు. అలాగే, నర్సంపేట డివిజన్ రైతుల కోసం రూ.9 కోట్ల సబ్సిడీతో 7 వేల మోటర్లును ఇచ్చేందుకు నిధులు తెచ్చామన్నారు. తాను నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేసి నిరూపిస్తానని పెద్ది స్పష్టం చేశారు. 30 ఏళ్లు ఇద్దరు నాయకులు దొంతి, రేవూరి పాలిస్తే నర్సంపేట డివిజన్ 20 ఏళ్లు వెనక్కి నడిచిందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక మరో ఐదేళ్లలో నర్సంపేటను అన్ని డివిజన్ల కంటే ముందు గా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

ఊడిగం చేసిన రేవూరి, దొంతి
తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంటి ముందు దొంతి మాధవరెడ్డి వాకిలి ఊడ్చితే, రేవూరి ప్రకాశ్‌రెడ్డి కళ్లాపు చల్లింది వాస్తవం కాదా అని పెద్ది ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచినందుకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యంతో నర్సంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి ఎన్ని కు ట్రలు చేసినా వారిని ఓడించి తీరుతామన్నారు. ఈ సందర్భంగా తెలుగునాడు మండల కమిటీ అధ్యక్షుడు కోటగిరి రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో 40 మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరగా పెద్ది వారి కి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ బానో తు సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, మం డల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఊడ్గుల ప్రవీణ్, మామీండ్ల పెద్ద మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బానోతు హరినాథ్‌సింగ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గందే శ్రీనివాస్ గుప్తా, గంగిశెట్టి శ్రీనివాస్ గుప్తా, ఖనాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు వేముల ప్రకాశ్‌రావు, గోనెల నరహరి, రాజారాం, సట్ల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...