కాళోజీ జీవితం అనుసరణీయం..


Mon,September 10, 2018 03:17 AM

-ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం నేటి యువతకు అనుసరణీయమని వర్ధన్నపేట ఎంపీ పీ మార్నేని రవీందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన కాళోజీ జయంతి వేడుకల్లో జెడ్పీటీసీ సారంగపాణి, ఏఎంసీ చైర్మన్ సంపత్‌రెడ్డితో కలిసి కళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు సీమాం ధ్ర పాలకులు చేస్తున్న అన్యాయాన్ని తన కలంతో తెలంగాణ సమాజానికి తెలియజెప్పిన మహామనీషి కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ మాండలికం, తెలుగు భాష గొప్పద నాన్ని ప్రపంచానికి చాటిన ఘనత కళోజీకే దక్కిందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ఆ మహనీయుడి జీవిత విశేషాలను ప్రతీ యువకుడు, విద్యార్థి స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్గం భిక్షపతి, అల్లమనేని మోహన్‌రావు, వసంత్‌నాయక్, ఎండీ అన్వర్, తోటకూరి శ్రీధర్, మిద్దెపాక రవీందర్, హన్మకొండ సుధాకర్, ఎలేందర్‌రెడ్డి, రాజు, వెంకన్న, చందులాల్ పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...