టీఆర్‌ఎస్ వెంటే ఉంటాం..


Mon,September 10, 2018 03:16 AM

కేసీఆర్ పథకాలు నచ్చాయి
అభివృద్ధికి ఎర్రబెల్లి కృషి బాగుంది
టీఆర్‌ఎస్‌లో చేరిన నీర్మాల, గుంటూరుపల్లె వాసులు

దేవరుప్పుల, సెప్టెంబర్ 09 : రైతు కుటుంబాల అభ్యున్నతే ధ్యేయంగా వ్యవసాయాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్న టీఆర్‌ఎస్ పార్టీ వెంటే తామంతా ఉంటాం. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని నీర్మాల పరిధిలోని గుంటూరు పల్లె వాసులు అన్నారు. హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వగృహంలో ఆదివారం ఆయనను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ సాగునీటి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారన్నారు. అనంతరం వారికి గులా బీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుంటూరు పల్లె వాసులు మాట్లాడుతూ.. సీం కేసీఆర్, ఎర్రబెల్లి చేపడుతున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మెట్టు రాయపురెడ్డి, గాదె మర్రెడ్డి, మెట్టు విజయభాస్కర్‌రెడ్డి, విన్సెంట్‌రెడ్డి, తుమ్మ జయపాల్‌రెడ్డి, తుమ్మ ఇమ్మాన్యూల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, బాసాని సుధాకర్‌రెడ్డి, తుమ్మ దావీదు రెడ్డి, పాపిరెడ్డి, రాయపురెడ్డి కుటుంబాలు ఉన్నాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల నాయ కులు దామోదర్‌రెడ్డి, ఆంజనేయులు, జోగేశ్, నీర్మాల మాజీ సర్పంచ్ ఇందిర, తదితరులు ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన విద్యా కమిటీ చైర్‌పర్సన్
నిర్మాల గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్ పర్సన్ రాజోజు మనోహరమ్మ కేసీఆర్ విద్యావ్యాప్తికి చేస్తున్న కృషికి, బాలికలకు అందిస్తున్న ఆరోగ్య కిట్లు, మహిళలకు అమలు చేస్తున్న అనేక పథకాలకు ఆకర్షితురాలై కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మనోహరమ్మకు గులాబి కండువా కప్పి ఎమ్మెల్యే దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
టీఆర్‌ఎస్‌లో రామచంద్రాపురం యాదవులు..
తెలంగాణ ప్రభుత్వం గొల్లకుర్మల కులవృత్తులకు, ఉపాధి కల్పనకు ప్రవేశపెడుతున్న అనేక పథకాలు తమ కు మునుపెన్నడూ ఏ ప్రభుత్వం అందించలేదంటూ రాంచంద్రాపురం గ్రామానికి చెందిన యాదవులు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మైసారావు నేతృత్వంలో వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి దయాకర్‌రావు పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయన వెంట తోకల అశోక్, ఎరసాని ఆంజనేయులు, కుమార్, తోకల ప్రసాద్ తదితరులున్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...