బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం


Mon,September 10, 2018 03:15 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నట్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నర్సంపేట ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో వివిధ కుల సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు గిరిజన, మైనార్టీలకు భవనాలు మంజూరయ్యాయన్నారు. గతంలో తాను హామీ ఇచ్చిన కుల సంఘాల భవనాలకు మొదటి అవకాశం ఇచ్చామన్నారు. గిరిజనుల బంజార భవన్, ముదిరాజ్‌లు, గీతకార్మికులు, పద్మశాలీ లు, మైనార్టీల కోసం రూ.50 లక్షల చొప్పున, రజక సంఘం కోసం రూ.15 లక్షలు, బెస్త సంఘం, సమన్వయ సమితి, రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనానికి, నాయీబ్రహ్మణ సంఘం, పూసల సం ఘం కోసం రూ.10 లక్షల చొప్పున కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, వైస్ చైర్మన్ మునిగాల పద్మ వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, బాల్నె సర్వేశం, గుంటి కిషన్, బండి ప్రవీణ్ పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...