ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం


Mon,September 10, 2018 03:14 AM

-ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు
రాయపర్తి, సెప్టెంబర్ 9 : పాలకుర్తి నియోజక వర్గంలోని ప్రజలందరి కష్టసుఖాల్లో తాము పాలుపంచుకుంటామని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో మండల నాయకులతో కలసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. మండలంలోని బురహాన్‌పల్లి గ్రామ శివారులోని తూర్పుతండాలో భూక్యా లకా్ష్మనాయక్, కొండూరులో పంతంగి కొంరుమల్లు, మొరిపిరాలలో ఓరుగంటి నర్సమ్మ జగన్నాథపల్లి శివారులోని దుబ్బతండాలో డాంగీ బాల్యానాయక్, కొండాపురం గ్రామంలో పెండ్యాల సురేందర్, దొమ్మాటి నవ్య, కొత్తూరులో భీమని పెద్ద కొంరయ్య, నాళ్లం సోమయ్య కుటుంబాలను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారం అందేవిధంగా కృషి చేస్తామని తెలిపారు.
మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కందికట్ల స్వామి ఇటీవల ప్రమాదంలో గాయపడి ద వాఖానలో చికిత్స పొందిన అనంతరం ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉషాదయాకర్‌రావు స్వామి నివాసానికి వెళ్లి బాధితుడిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. చి కిత్స కోసం అయిన ఖర్చులను ప్రభుత్వపరంగా అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఆమె వెంట మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ మునావత్ నర్సింహనాయక్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సురేందర్‌రావు, నాయకులు సుదర్శన్‌రెడ్డి, దయాకర్‌రావు, యా కయ్య, వేణుగోపాల్‌రెడ్డి, వెంకన్న, సోమనాథం, విజయ్‌కుమార్, రామస్వామి, రమేశ్, సంతోష్‌గౌడ్, మధు, ఎల్లాగౌడ్, యాదగిరి పాల్గొన్నా రు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...