మిట్టకాల్వ నిండా పిచ్చి మొక్కలే..


Sun,September 9, 2018 03:05 AM

-ఐబీ అధికారుల నిర్లక్ష్యంతో కాల్వలకు గండ్లు
-నిధులు మంజూరైనా సాగని పనులు
నర్సంపేట రూరల్, సెప్టెంబర్08: జిల్లాలో రెండో అతిపెద్ద చెరువైన మాధన్నపేట పెద్ద చెరువు కింద ఉన్న మిట్టకాల్వ నిండా పిచ్చి మొక్కలు పెరిగాయి. ఐబీ అధికారుల నిర్లక్ష్యంతో కాల్వలకు గండ్లు పడుతున్నాయి. అంతేగాక వరి పొలాలకు సాగు నీరు సరిగ్గా అందక పొలాలు ఎండుతున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు చేసేదేమిలేక స్వచ్ఛందంగా ముందుకువచ్చి కాల్వలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే... నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువు పరిధిలో మూడు కాల్వల ద్వారా ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటలకు సాగు నీరు కొంత కాలంగా అందుతుంది. పెద్ద చెరువు కింద అధికారికంగా 4,850 ఎకరాలు, అనధికారికంగా మరో 1500ఎకరాల వరి సాగు అవుతుంది. చెరువు పరిధిలోని మిట్టకాల్వ, దుబ్బకాల్వ, పెద్ద కాల్వల నుంచి సాగు నీరు వరి పొలాలకు పారుతుంది. ఈక్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా మిట్ట కాల్వ మరమ్మతు పనులు చేపట్టలేదు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకంలో రూ.7.50కోట్ల నిధులను మంజూరు చేసింది. ఆపనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాల్వల మరమ్మతు పనులు నేటికీ చేపట్టలేదు. ఐబీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరుగలేదు. దీంతో కాల్వతో పాటు పొడుగున వివిధ రకాల పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగాయి. రెండు నెలల కింద చెరువు కింద ఆయకట్టు రైతులు వరి నాట్లు వేశారు. ప్రసుత్తం వరి పొలాలు ఏపుగా పెరిగాయి. పిచ్చి మొక్కల వల్ల చెరువు నుంచి వదిలిన సాగు నీరు వరి పొలాలకు అందడం లేదు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...