ఘనంగా చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు


Sun,September 9, 2018 03:04 AM

పరకాల, నమస్తే తెలంగాణ : తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు పరకాల నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల కేక్ కటింగ్‌లు, అన్నదానాలు, మొక్క లు నాటడం వంటి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో జరిగిన వేడుకలు, రక్తదాన శిబిరంలో 2వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివెళ్లి రక్తదానం చేశారు. పరకాల పట్టణంలోని బేతెల్ అనాథపిల్లల ఆశ్రమంలో కౌన్సిలర్ మడికొండ సంపత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ శాలుమాథ్యు, ఆశ్రమ నిర్వాహకురాలు సారమ్మజాన్, గుర్ర సత్యానందం, టీఆర్‌ఎస్ నాయకులు రేగూరి విజయపాల్‌రెడ్డి, మడికొండ శ్రీను, పంచగిరి శ్రీనివాస్, బి.ప్రకాష్, మంద నరేష్, మహేశ్, అన్వేశ్, కొంరయ్య, రవి, భద్రయ్య, రత్నజీవన్ తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దు బాసి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి వజ్ర రవికుమార్, రైతు సమన్వయ సమితి పట్టణ అధ్యక్షుడు దగ్గు విజేందర్‌రావు, చింతిరెడ్డి సాంబరెడ్డి, రేగూరి విజయపాల్‌రెడ్డి, పంచగిరి సుధాకర్, పంచగిరి శ్రీనివాస్, బొచ్చు జితేందర్, మునిగంటి విష్ణువర్ధన్, యాత నరేష్, లింగాల సత్యం, ఎండీ జలాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా నియోజకవర్గం నుంచి 2వేల మంది వరకు రక్తదానం చేసేందుకు తరలివెళ్లారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...