లోక్ అదాలత్‌లో 47 కేసుల పరిష్కారం


Sun,September 9, 2018 03:04 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 47 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించబడ్డాయి. న్యాయమూర్తులు రెండు బెంచ్‌లుగా ఏర్పడి కేసులను పరిష్కరించారు. మొదటి బెంచ్‌లో న్యాయమూర్తి హుస్సేన్, రెండవ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తి ఖుష్బు ఉపాధ్యాయ, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు ఏర్పడి క్రిమినల్, కుటుంబ కలహాలు, ఇతర కేసులు పరిష్కరించినట్లు జాతీయ లోక్‌అదాలత్ సభ్యులు ఒంటేరు రాజమౌళి తెలిపారు. పరకాల ఏసీపీ వైవీఎస్ సుధీంద్ర, సీఐ మధు, పరకాల, శాయంపేట ఎస్సైలు హాజరయ్యారు. లోక్ అదాలత్‌కు పరకాల, శాయంపేట, దామెర, చిట్యాల, భూపాలపల్లి, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలకు చెందిన కక్షిదారులు పాల్గొని తమ కేసులను పరిష్కరించుకున్నట్లు చెప్పా రు. ప్రజలు మంచిగా కలిసిమెలిసి ఉండాలని, కొట్లాటలు లేకుండా జీవితం గడపాలని న్యాయమూర్తి హుస్సేన్ కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు కె.శ్రీనివాస్, సభ్యులు వెంకటరమణ, న్యాయవాది అక్షయ, వేణు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...