క్రీడలతో ఉజ్వల భవిష్యత్


Sun,September 9, 2018 03:03 AM

-లయన్స్ క్లబ్ నర్సంపేట అధ్యక్షుడు నరహరి రాజేందర్‌రెడ్డి
-దుగ్గొండిలో జిల్లా స్థాయి రెజ్లింగ్ క్రీడా పోటీలు
దుగ్గొండి, సెప్టెంబర్ 08 : చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట అధ్యక్షుడు నరహరి రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం దుగ్గొండి మండల కేంద్రంలోని జాగృతి హైస్కూల్ క్రీడామైదానంలో వరంగల్ జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కుస్తీ(రెజ్లింగ్) పోటీలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట అధ్యక్షుడు నరహరి రాజేందర్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బుజుగుండ్ల రాజేంద్రకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన విశ్వక్రీడల్లో రెజ్లింగ్ క్రీడాకారులు దేశానికి అత్యధిక పతకాలు సాధించడం ఎంతో గర్వించదగిన విషయమన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కాగా, పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు వంద మంది రెజ్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శానబోయిన రాజ్‌కుమార్, యాదగిరి సుదాకర్, కోశాధికారి, కోచ్ కందికొండ రాజు, వరంగల్ జిల్లా ఎస్‌జీఎప్‌ఐ కార్యదర్శి భిక్షపతి, టీజీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెకారి రంగారావు, జిల్లా అధ్యక్షుడు మోడెం విద్యాసాగర్, దుగ్గొండి మాజీ సర్పంచ్ ఆరెల్లి చందనా, సతీశ్, మామిడాల వేణు, పొగాకు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...