బాధిత కుటుంబాలకు పెద్ది పరామర్శ


Sun,September 9, 2018 03:03 AM

నర్సంపేట రూరల్/ఖానాపురం, సెప్టెంబర్ 08: నర్సంపేట మండలంలోని దాసరిపల్లి గ్రామంలో, ఖానాపురం మండల కేంద్రంలో బాధిత కుటుంబాలను శనివారం రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. దాసరిపల్లికి చెందిన పుచ్చ కాయల రమాదేవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న పెద్ది శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తొలుత రమాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో నల్లబెల్లి ఎంపీపీ బానోతు సారంగపాణి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మచ్చిక నర్సయ్యగౌడ్, గూళ్ల అశోక్‌కుమార్, దాసరి నర్సింహారెడ్డి, సంకటి గణపతిరెడ్డి, దాసరి బుచ్చిరెడ్డి, వల్లాల కర్ణాకర్, బిక్షపతి, చేరాలు, రవి, రమేష్ తదితరులున్నారు. అలాగే ఖానాపురం గ్రామానికి చెందిన పమిడిముక్కుల రంగనాయకమ్మ (80)శనివారం అనారోగ్యంతో మృతి చెందగా మృతురాలి కుటుంబాన్ని పెద్ది పరామర్శించారు. ఆయన వెంట నర్సంపేట మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు, వల్లెపు శ్రీను, దేవినేని వేణుగోపాల్‌రావు, కుమార్, ఎంపీటీసీ బోడపూలు, ఉన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...