అంతర్జాతీయ సదస్సుకు ఏపీఎం ఎంపిక


Sun,September 9, 2018 03:02 AM

దుగ్గొండి : అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందకు మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గుజ్జుల రాజ్‌కుమార్‌కు ఎంపికయ్యాడు. మండలంలో ఏపీఎంగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్‌కుమార్‌కు ఈనెల 16 నుంచి 19 వరకు థాయ్‌లాండ్, బ్యాంకాంగ్ దేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సు లో పాల్గొనేందకు ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే 8 దేశాల్లో జరిగిన సదస్సులో పాల్గొని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, దేశ ఔన్నత్యాన్ని , గొప్పదనాన్ని, చరిత్రను చాటి చెప్పడం జరిగిందన్నారు. గతంలో తెలంగాణ బాషాసంస్కృతి శాఖా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా సేవాజ్యోతి రత్న అవార్డును తీసుకోవడం జరిగిందన్నారు. ఆసియా ఖండానికి బ్రాండ్ అంబాసిడర్‌గా (యువ)వ్యవహరిస్తూ నేటికి 52 కామన్‌వెల్త్ దేశాలకు సభ్యుడుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. బ్యాంకాంగ్ సదస్సుకు వెళ్తున్న రాజ్‌కుమార్‌కు పలువురు మండలాధికారులు, ఐకేపీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...