మరోసారి విజయబావుటా ఎగరేద్దాం


Sat,September 8, 2018 02:18 AM

శాయంపేట, సెప్టెంబర్ 7 : వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయబావుటా ఎగరేద్దామని, ఏ ఒక్కరిని తన నుంచి దూరం పోనివ్వనని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం మండలంలోని మాందారిపేట హైవేపై స్పీకర్ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. భూపాలపల్లి నుంచి తనకు మరోసారి టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా కేసీఆర్ నిలిచారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయన్నారు.

ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిరికొండను సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఓఎస్‌డీ గడ్డం భాస్కర్, పార్టీ నాయకులు స్పీకర్‌కు పూలమాలలు, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు భారీ ర్యాలీగా రాగా స్పీకర్‌తో భూపాలపల్లికి తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, కార్యదర్శి పోతు రమణారెడ్డి, ఎంపీటీసీ బగ్గి రమేశ్, రవి, మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాశ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కర్ర ఆదిరెడ్డి, ఇమ్మడిశెట్టి రవీందర్, వలుపదాసు చంద్రమౌళి, సదయ్య, వైనాల కుమారస్వామి, అడుప ప్రభాకర్, బుస్స సంపత్, మిరుపెల్లి కృష్ణ, తోకల సమ్మిరెడ్డి, వడ్డెపల్లి శ్రీనివాస్, నాగరాజు, పోతుగంటి మల్లయ్య, సమ్మయ్య, సంజీవరెడ్డి, కొమ్ముల శివ, ఇటుకాల పాపారావు తదితరులున్నారు.

పరకాలలో ర్యాలీ
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాలలో స్వర్ణకార సంఘం, టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన స్పీకర్ మాందారిపేట నుంచి ద్విచక్రవాహనాలపై ర్యాలీ గా పరకాలకు చేరుకున్నారు. దాంతో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ నాయకులు పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సం ఘం అధ్యక్షుడు శంకరాచారి, సిరికొండ స్వర్ణకార సంఘం నాయకులు సిరికొండ శ్రీనివాసాచారి, వంగాల కోటేశ్వర్, పరమానందం, ఉత్తంకుమార్, రాజు, నర్సింహమూర్తి, రామన్నతోపాటు రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బొల్లె బిక్షపతి, నాయకులు పాడి ప్రతాప్‌రెడ్డి, దగ్గు విజేందర్‌రావు, కౌన్సిలర్లు వేణుగోపాలమూర్తి, సిరికొండ అభితేజ, ఇంగిలి వీరేశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...