పల్లెపల్లెకు అభివృద్ధి, గడపగడపకు సంక్షేమ పథకాలు


Sat,September 8, 2018 02:18 AM

న్యూశాయంపేట, సెప్టెంబర్07: తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెకు అభివృద్ధి, గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలను ఒట్లడిగే హాక్కు ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకే ఉందని వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హాంటర్‌రోడ్డు సీఎస్‌ఆర్ గార్డెన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజక వర్గ నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలోనే స్థానం దక్కించుకున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మడికొండ జంక్షన్ నుంచి అదాలత్ జంక్షన్ వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా సీఎస్‌ఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. నియోకవర్గ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అవినీతిరహిర పాలన అందిస్తుందని అన్నారు. సమైక్య పాలనలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తూ పలువురికి ఉద్యోగ ఆవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తున్నానని అన్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.236కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ ఎల్లావుల లలిత యాదవ్, ఎంపీపీ మర్నేని రవీందర్‌రావు, బండి రజనీకుమర్, ఎనుమాముల మర్కెట్ కమిటీ డైరెక్టర్ గునిపాక విజయ్‌కుమార్, ఐనవోలు దేవస్థాన కమిటీ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, కార్పొరేటర్లు జోరిక రమేశ్, వీర బిక్షపతి, బస్కే శ్రీలత, కల్పన తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 07: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తిలో కారుకు మొదటి గేరు పడింది. నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు టిక్కెట్ కేటాయించడంతో శుక్రవారం నియోజకవర్గ నాయకులంతా భారీ ర్యాలీతో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఘన స్వాగతం పలికారు. పాలకుర్తి దేవస్థానంలో పూజల తర్వాత పెద్దవంగర మండల కేంద్రానికి చేరుకొని చర్చిలో ప్రార్థన చేశారు. అనంతరం తొర్రూరు జామా మసీదులో నమాజ్ చేశారు. నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి కోసం మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ప్రతీసర్వేలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు అందనంత దూరంలో ఉన్నారని, కార్యకర్తలు కష్టపడితే కనీసం 50నుంచి 60వేల మెజార్టీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కాగా టీఆర్‌ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారమే ప్రచారాన్ని మొదలు పెట్టారు. దీంతో కార్యకర్తల్లో సైతం ఉత్సాహం మొదలైంది.

ఎర్రబెల్లికి అభినందనలు
రాయపర్తి: పాలకుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ శాసనసభ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరును కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ టీఆర్‌ఎస్ మండల మండల అధ్యక్షుడు అనిమిరెడ్డి నేతృత్వంలో నాయకులు హన్మకొండలోని ఆయన నివాసంలో కలిసి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్‌రావు, రమేశ్, బాబు, రమేశ్‌రెడ్డి ఉన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...