ఆశీర్వాదానికి అంతా సిద్ధం


Fri,September 7, 2018 02:32 AM

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ: ఇప్పుడు అందరి చూపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వైపే ఉంది. అటు అసెంబ్లీని రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాను న్న ఎన్నికలకు ఇక్కడి నుంచే శంఖారావం పూరించనుండడంతో అందరి దృష్టి ఇప్పు డు హుస్నాబాద్‌పైనే పడింది. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట 50 రోజుల్లో 100 నియోజక వర్గాల్లో 100 బహిరంగ సభల ను నిర్వహించేందుకు నిర్ణయించిన సీఎం మొదటగా హుస్నాబాద్‌ను ఎన్నుకోవడం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 2.30 సీయం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా సభాస్థలి చేరుకుంటారు. రెండు గంటల పాటు సభ కొనసాగుతుంది. ఈ సభకు భారీ ఎత్తున జనం రానుండడంతో పకడ్బందీగా ఎర్పాట్లను చేశారు. మన జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవర పల్లి మండలాలు హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలోనే ఉండడంతో ఈ రెండు మండలాల నుంచి సు మారు ఇరవై వేల మంది సభకు తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం టీఆర్‌ఎస్ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలను స్వయంగా కలిసి సభకు ఆహ్వానం పలుకుతున్నారు. రానున్న ఎన్నికలకు ఇది తొలి ప్రచారసభగా చెప్పుకుంటున్న జనం వేలాదిగా వెళ్లేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. రెండు రోజులుగా భీమదేవరపల్లికి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పణ్యాల భూ పతి రెడ్డి, మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఎల్కతుర్తికి కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావులతో పాటు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌లు జనాలను తరలించేందుకు దిశానిర్దేశం చేశారు.

ఇదిలా ఉంటే సభ హుస్నాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి సభా వేదికను, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షస్తున్నారు. పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ పట్టణం నుంచి సభాస్థలికి వెళ్లే అన్ని మార్గాల్లో వాహన పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. పదెకరాల స్థలంలో సభాస్థలిని ఎర్పాటు చేశారు. సుమారు వందమంది కూర్చునేలా వేదికను నిర్మించారు. వేదిక ముందు ఐదువేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలను సైతం వేస్తున్నారు. కాగా సభాస్థలి వద్ద మంత్రి హరీశ్‌రావు గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లడుతూ 2014లో ఎన్నికల శంఖారావం హుస్నాబాద్ నుంచే పూరించి ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నామని, ఇప్పుడు కూడా హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తున్నామని, గతానికంటే భారీ విజయాలను చేజిక్కించుకుంటామని దీమావ్యక్తం చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీశ్‌కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమైందని జోస్యం చెప్పా రు. కాగా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నుంచి వెళ్లే వాహనాలకు హుస్నాబా ద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పా ర్కింగ్ కేటాయించారు. ఈ సభకు ముగ్గు రు ఎస్పీలతో పాటు, 5గురు ఏఎస్పీలు, 15 మంది ఏసీపీలు, ఏఆర్ డీస్పీలు ఇద్ద రు, 50 మంది సీఐలు, 101 మంది ఎస్సై లు, 120 మంది ఏఎస్సైలు, 905 మంది కానిస్టేబుళ్లు, మహిళా పీసీలు 80 మంది, ఏఆర్ పీసీలు 100 మంది, స్పెషల్ పార్టీలు ఎనిమిది, డాగ్ స్వ్కాడ్ 5 మంది, బాంబ్ డిస్పోజల్ టీంలు 10, రోడ్ ఓపనింగ్ పార్టీ లు15 బందోబస్తులో ఉన్నాయి. మొత్తం 20 సెక్టార్లుగా విభజించారు. కమ్యూనికేషన్ సెట్లు 100 ఏర్పాటు చేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...