వర్ధన్నపేట అభివృద్ధికి రూ.20కోట్లు


Fri,September 7, 2018 02:32 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పురపాలకశాఖ ద్వారా రూ.20 కోట్లను మంజూరు చేసిందని తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిధుల విడుదల కోసం జారీ చేసిన జీవోను మున్సిపల్ కమిషనర్ రవీందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ కేటీఆర్‌ను కలిసి నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. దీంతో ఆయన రెండు రోజుల క్రితమే రూ.20కోట్లను మంజూరు చేస్తున్నట్లు జీవో జారీ చేశారన్నారు. ఈ నిధులతో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో అన్ని తండాల్లో ప్రజలకు మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. కాగా, నిధులు విడుదల చేయించడంతో అరూరి రమేశ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, ఎంపీటీసీలు రాజమణి, లక్ష్మీ, కోఆప్షన్ సభ్యుడు అన్వర్, రైతు మండల కన్వీనర్ మోహన్‌రావు, ఏఎంసీ డైరెక్టర్ పూజారి రఘు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...