కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం


Fri,September 7, 2018 02:31 AM

పరకాల, నమస్తే తెలంగాణ : వేతనాలు పెంచినందుకు టీఆర్‌ఎస్ అధినేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రెండో ఏఎన్‌ఎంలు గురువారం క్షీరాభిషేకం చేశారు. మండలంలోని నర్సక్కపల్లె గ్రామంలో జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి ఆధ్వర్యంలో రెండో ఏఎన్ ఎంలు కీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో పరుగు లు పెట్టించి, ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేసిన ఘనతకేసీఆర్‌దేనన్నారు. అనంతరం పలువురు ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించిన కేసీఆర్ జీతాలను పెంచడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెండో ఏఎన్‌ఎంలు డీ సునీత, స్వాతి, కరుణ, భాగ్యలక్ష్మి, కల్పన, శ్రీలత, గీత, సంధ్య పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...