ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే


Fri,September 7, 2018 02:31 AM

రూరల్‌కలెక్టరేట్06,సెప్టెంబర్: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాడని అతడిపై విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ హరితను క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంతి మాధవరెడ్డి నియోజకవర్గంలో శ్రీమాతా కన్‌స్ట్రక్షన్స్ పేరుతో చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపించిందని, దీంతో అధిక మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడీపీ నాయకులు వేజెళ్ళ ఉమామహెశ్వర్‌రావు,ఆజ్మీరా శ్రీనివాస్‌నాయక్,టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ జాటోతు సంతోశ్‌నాయక్, మార్గం సారంగం, మామిండ్ల మోహన్‌రెడ్డి,తునం స్వామి,చుక్క రమేశ్, అడప నర్సింగరావు,స్వామి,కుమారస్వామి,భక్ష్య తదితరులు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...