అనువంశీకత సినిమాను ఆదరించాలి


Fri,September 7, 2018 02:30 AM

శాయంపేట, సెప్టెంబర్ 6: మన ప్రాంతానికి చెందిన తాళ్లపెల్లి దామోదర్‌గౌడ్ నిర్మించిన అనువంశీకత సినిమాను ప్రజలు ఆదరించాలని తెలంగాణ జాగృతియువత రాష్ట్ర నాయకుడు అమ్మ అశోక్ అన్నారు. మండలంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన దామోదర్ ఎన్నో సినిమాల్లో నటించారని, పూర్తిగా అనువంశీకతను ఓరుగల్లు ఉమ్మడి జిల్లా పరిసరాల్లో చిత్రీకరించారన్నారు. బొగత జలపాతం, పాండవులగుట్ట, లక్నవరం, రామప్ప ప్రాంతాల్లో ఓరుగల్లు టూరిజాన్ని చూపించారన్నారు. ఎన్నో కష్టాలను ఓర్చుకుని నిర్మాతగా మారి ఓరుగల్లును ప్రపంచానికి చాటిచెప్పాలన్న సంకల్పంతో తీసిన సినిమా ఇది అన్నారు. దామోదర్ నిర్మించిన అనువంశీకత సినిమా 7న విడుదల అవుతున్నట్లు చెప్పారు. తెలంగాణ బిడ్డల సాహసాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పైండ్ల భాను, తదితరులున్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...