మూడు రోజుల్లో రూ.212 కోట్ల పనులు


Thu,September 6, 2018 01:26 AM

-వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
-నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన
-పలు అభివృద్ధి పనులు ప్రారంభం
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : వర్ధన్నపేట నియోజకవర్గంలో గత మూడు రోజుల్లో రూ.212.76 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. బుధవారం వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధన్నపేట ఎంపీపీ కార్యాలయాన్ని రూ.1.10కోట్ల నిధులతో నిర్మించినట్లు తెలిపారు. అలాగే, నియోజకవర్గ పరిధిలోని గిరిజన తండాలకు బీటీ రోడ్లు వేయడానికి రూ.24 కోట్లతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.21.80కోట్లతో భూమిపూజ చేసినట్లు వివరించారు. గ్రేటర్ విలీన 31 గ్రామాల్లో రూ.34 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాక సీసీ రోడ్లకు మంత్రి కేటీఆర్ మరో రూ.20కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గోపాలపురం నుంచి అనంతసాగర్ వరకు రూ.21 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణానికి, ఆరెపల్లి నుంచి కంఠాత్మకూర్ రోడ్డు వరకు వైండింగ్ కోసం రూ.20 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఆకేరువాగుపైన నందనం, ఇల్లంద, పర్వతగిరి చెక్‌డ్యాంలకు రూ.12కోట్ల, కొత్తపల్లి-కట్య్రాల బ్రిడ్జి, చెక్‌డ్యాంకు రూ.15 కోట్లతో భూమిపూజ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, ల్యాబర్తి-జగన్నాథతండా వరకు రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.18.40కోట్లతో, హసన్‌పర్తి మండలంలోని మల్లారెడ్డిపల్లి - సూదనపల్లి బ్రిడ్జి, చెక్‌డ్యాంకు రూ.6 కోట్లతో భూమి పూజ చేసినట్లు వివరించారు. కోనారెడ్డి కట్టు కాల్వకు రూ.3 కోట్లు, మైనార్టీ ద్వారా రూ.1.32 కోట్లతో భూమి పూజలు చేసినట్లు చెప్పారు. గతంలో కలెక్టర్ గుండ్ల సింగారం, వంగపహాడ్ ప్రజల కోసం రూ.3.75కోట్లతో మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించడంతో దానికి కూడా భూమిపూజ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, కుడా, ఆర్‌అండ్‌బీ, ట్రైబల్ వెల్ఫేర్ల ద్వారా నియోజకవర్గంలో మొత్తంగా రూ.212.76 కోట్లతో మూడు రోజుల్లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
పలు పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రమేశ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఐదు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇటీవల ప్రభుత్వం రూ.212.76 కోట్లు మంజూరు చేసింది. ఇందులో అంతర్గత బీటీ రోడ్లతో పాటుగా ఆకేరువాగు చెక్‌డ్యాం నిర్మాణం కోసం నిధులు కేటాయించింది. అలాగే, వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయానికి రూ.1.10కోట్లు మంజూరు కావడంతో ఇటీవల పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ఎమ్మెల్యే రమేశ్, ఎంపీపీ రవీందర్‌రావు, ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే, ఆకేవారుగుపై నిర్మించనున్న చెక్‌డ్యాంలు, బీటీరోడ్లు, ఎస్సీ కాలనీలలో సీసీరోడ్లు, గిరిజన తండాలకు నిర్మించనున్న బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఐనవోలు చైర్మన్ గజ్జెలి శ్రీరాములు, రైతు జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, ఎంపీడీవో కల్పన, వైస్ ఎంపీపీ మార్గం కౌసల్య, రైతు మండల కన్వీనర్ మోహన్‌రావు, కో-ఆప్షన్ సభ్యులు అన్వర్, ఆత్మ డైరెక్టర్ బిక్షపతి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...