రైతు బీమా కుటుంబానికి ధీమా


Thu,September 6, 2018 01:25 AM

శాయంపేట, సెప్టెంబర్ 5 : రైతు బీమా కుటుం బా నికి ధీమా అని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలో ని పెద్దకోడెపాకు చెందిన రైతు వావిళ్ల సదయ్య మరణించిన పది రోజుల్లోనే రైతుకు నామినీగా ఉన్న కుమారుడు రాజేందర్ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఈ మేరకు బీమా సొమ్ము మంజూరు పత్రాలను మండల కేంద్రంలో స్పీకర్ కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. మృతుడి కుమారుడు రాజేందర్ మాట్లాడుతూ నాన్న, నేను కలిసి వ్యవసాయం చేసేవాళ్లం. మాకు రెండెకరాల పొలం ఉండటంతో వాటిపై ఆధారపడి బతుకుతున్నాం. మాకు కేసీఆర్ సారు అండగా నిలిచారు. మా వంటి కుటుంబాలకు బీమా ఎంతో భరోసా ఇస్తున్నది. సీఎం కేసీఆర్‌ను జీవితంలో ఎప్పటికీ మరువలేము. కార్యక్రమంలో ఏవో మాధవి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కర్ర ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, పోతు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్, ఏఈవోలు శివ, రాకేష్, రజా తదితరులున్నారు. అనంతరం శాయంపేట గ్రామానికి చెందిన గట్టు సతీష్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.25వేల చెక్కును స్పీకర్ ఆయనకు బుధవారం అందజేశారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...