సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం


Thu,September 6, 2018 01:25 AM

దుగ్గొండి, సెప్టెంబర్ 05 : మండలంలోని గిర్నిబావిలో లక్కమారి కాపు సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు. గ్రామదేవత విగ్రహం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు యార మల్లారెడ్డి మాట్లాడుతూ లక్కమారి కాపు సంఘానికి హైదరాబాద్‌లో 20 గుంటల స్థలాన్ని ఇచ్చి, రూ.50 లక్షలు మంజూరు చేయడం అభినందనీమన్నారు. రాష్ట్రంలోని సబ్బండ కులాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కొనుకటి రాజేందర్, జిల్లా యూత్ అధ్యక్షుడు ముస్కు రాజేందర్‌రెడ్డి, అనుముల మల్లారెడ్డి, అనుముల సురేశ్, యారమోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఆరె జేపాల్‌రెడ్డి, గోళి రవి, యార నర్సిరెడ్డి, సురేశ్, అనుములు రహేశ్, పెండ్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...