ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం


Fri,December 13, 2019 01:54 AM

- జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాసులు
రేవల్లి : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వనపర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతామొహంతి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యంఅందుతుందని, ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో చికిత్సలు చేస్తున్నారని జిల్లా వైద్యాదికారి డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వదవాఖానలో నలుగురికి కష్టతరమైన కాన్పులు, ఒకరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వదవాఖానల్లో ప్రజల కోసం ఎన్నో వసతులు నెలకొల్పి ప్రజలకు వాటితోనే మెరుగైన చికిత్సలు చేస్తున్నారన్నారు. మరుమూల ప్రాంతమైన రేవల్లి ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులున్నాయని, ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాల నిమిత్తం ప్రతి గురువారం ఇక్కడ కాన్పులు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కేసీఆర్‌ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజ్‌కుమార్‌, హెల్త్‌అసిస్టెంట్‌ రాజేందర్‌, చారి, రాము పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...