బాధ్యతగా పని చేయాలి


Tue,December 10, 2019 01:32 AM

-మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ రాదని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ప్రజలకు చేసిన మేలు ఎల్లప్పుడు పదిలంగా ఉండాలని ఆకాక్షిస్తున్నాని మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో తన ఛాంబర్‌లో ప్రమోషన్‌ పొందిన ఉద్యోగులతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పరిధిలోని 20 మంది జూనియర్‌ అసిస్టేంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడం జరిగిందని తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతగా పని చేయాలని తెలిపారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులను ఆయా జిల్లాలకు కేటాయిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎక్కడ పని చేసినా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు. 20 మందిలో 8 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు ఆయా జిల్లాలోని ప్రాంతాలను కేటాయిస్తు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. మరో 12 మంది సీనియర్‌ అసిస్టెంట్లను జిల్లాలకే కేటాయించి ఆ జిల్లా అధికారులు తదుపరి ఉత్తర్వులు అందజేసేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో యాదయ్య, మినిస్టిరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...