అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు


Tue,December 10, 2019 01:30 AM

-జెడ్పీటీసీ కృష్ణయ్య
మదనాపురం : నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని జెడ్పీటీసీ కృష్ణయ్య అన్నారు. సోమవారం మండలంలోని అజ్జకొల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌పార్టీ వార్డు మెంబర్‌ కుర్వ చంద్రమ్మ, ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనంతరం వార్డు మెంబర్‌ చంద్రమ్మ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మైనార్టీ మండలాధ్యక్షుడు మక్బుల్‌, మాజీ వైస్‌ ఎంపీపీ శంకర్‌బాబు, నాయకులు రవీందర్‌రెడ్డి, రాజిరెడ్డి, డీలర్‌ నర్సింహ, వాకిటి సత్యం, లక్ష్మన్న, శ్రీనివాసులు, నాగేష్‌, నర్సింహ్మలు, మనోజ్‌కుమార్‌, విష్ణు, రవికుమార్‌ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...