కరాటే పోటీలలో అజ్జకొల్లు విద్యార్థి ప్రతిభ


Sun,December 8, 2019 11:49 PM

మదనాపురం : మండలంలోని అజ్జకొల్లు గ్రామానికి చెందిన నవనీత అండర్‌-16 స్పైరింగ్‌ విభాగంలో పాల్గొని బంగారు పథకం సాధించినట్లు కోచ్‌ శివ యాదవ్‌ ఆదివారం తెలిపారు. నారాయణపేట పట్టణంలోని మెట్రో ఫంక్షన్‌ హాల్‌లో డ్రాగన్‌ షోటోకాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో సుమారు 12 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పథకం సాధించిన నవనీతను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కరాటే అసోసియేషన్‌ మాస్టర్స్‌ అభినందించారు. టైగర్‌ బ్రూస్‌లీ షాటోకాన్‌ కరాటే అకాడమీ శిక్షణలో ఎంతోమంది విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని కోచ్‌ శివయాదవ్‌, క్లబ్‌ మాస్టర్స్‌ శ్రీకాంత్‌ యాదవ్‌, గిరి, శ్రీను, శ్రీకాంత్‌, సంతోష్‌, గోపికృష్ణలు వ్యక్తం చేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...