దిశ నిందితులకు సరైన శిక్ష


Sat,December 7, 2019 03:06 AM

-దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పలువురి హర్షం
-దిశకు నివాళి, విద్యార్థుల ర్యాలీ
ఖిల్లాఘణపురం : ఇటీవల షాద్‌నగర్‌లో జరిగిన దిశ హత్య నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం పట్ల ఖిల్లాఘణపురం టీఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి, దిశ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిశ హ త్య చాలా దారుణమని, హత్య నిందితులను ఎన్‌కౌంటర్ చేసి దిశ ఆత్మకు శాంతి చేకూర్చారని, అందుకు పోలీసులకు వారు అభినందించారు. దిశ హత్య నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దిశ ఆత్మకు శాంతి చేకూరిందని విశ్వబ్రహ్మాణ సంఘం మండలాధ్యక్షుడు కమ్మర్‌గోపి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులచే ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సామ్యనాయక్, మండలాధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు మదన్‌మోహన్, గోపాల్, బాల్‌రెడ్డి, కృష్ణయ్యగౌడ్, భూమయ్య, కృష్ణయ్య, మధు, ఆంజనేయులుగౌడ్, గిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీసులకు హ్యాట్సాఫ్
వనపర్తి విద్యావిభాగం : దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసి ఆమె ఆత్మకు పోలీసులు శాంతి చేకూర్చారని వాగ్దేవి కళాశాల యాజమాన్య సభ్యుడు రవి అన్నారు. శుక్రవారం కళాశాల విద్యార్థులచే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ముందుగా రామాలయం, కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ చేపట్టారు. పోలీస్ అధికారి సర్జనార్ తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి నేరాలు చేయడానికి జంకుతారని, శిక్షలు అమలైనప్పుడే పోలీస్‌లపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఎన్‌కౌంటర్ సరియైన నిర్ణయమని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పక్కిరయ్య, విద్యార్థులు ఉన్నారు.

సరైన శిక్ష విధించారు
వనపర్తి, నమస్తే తెలంగాణ : దిశ హత్యకు కారకులైన నిందితులకు పోలీసులు ఎన్‌కౌంటర్ రూపంలో సరైన శిక్షను విధించడం జరిగిందని టీయూడబ్ల్యూజే(ఐజేయూ)జిల్లా అధ్యక్షుడు మధుగౌడ్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తెల్లవారు జామున నిందితుల ఎన్‌కౌంటర్ పట్ల ప్రభుత్వనికి, పోలీసులకు తమ సంస్థ తరుఫున అభినందనలు తెలిపారు. దిశ ఘటనకి సంబంధించిన కేసుని పది రోజుల్లో పోలీసులు ముగించడం పట్ల తెలంగాణ పోలీసులు దేశంలోనే స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...