అంబేద్కర్ సిద్ధాంతాలతో ముందుకు సాగాలి


Sat,December 7, 2019 03:03 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సి ద్ధాంతాలతో ముందుకు నడిచి అందరికీ ఆదర్శంగా ఉండేలా జైభీం సంస్థ పని చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏపీ మీ సే వా స్వచ్ఛంద సంస్థ నూతన భ వనాన్ని మంత్రి జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అ నంతరం అంబేద్కర్, గౌతమబుద్ధుడి చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ రా జ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారతదేశంలో ఒక వర్గానికి చెందినవాడిగా భావించకూడదన్నా రు. సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం ని ర్మూలన కోసం, అణగారిన జాతి బాగు కోసం పరితపించేవారని, ఆయన ఆలోచనలు అమలు చేయడంలో భారతదేశం కఠినతరంగానే వ్యవహరిస్తుందన్నా రు. ఆలోచన విధానాలు సంపూర్ణంగా అమలు కావాలంటే సమయం పడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల ఐక్య సమితి అధ్యక్షుడు బాలనాదం, శ్రీనివాసులు, చంద్రశేఖర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆనం ద్, ఆంజనేయులు, శ్రీనివాసులు, యాదగిరి, నారాయణ, సింగోటం, రామస్వామి, నరసింహ, నాగశేషులు ఉన్నారు.

కొత్తకోటలో ఎమ్మెల్యే ఆల నివాళి
కొత్తకోట బీఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...