ఎక్కడికక్కడ వదిలేయకండి


Thu,December 5, 2019 12:47 AM

-‘భగీరథ’ పనులు త్వరగా పూర్తిచేయాలి
-15 రోజుల్లో అన్ని గ్రామాలకూ నీరందాలి
-అధికారులు హరితహారంపై దృష్టిసారించాలి
-గ్రామాల్లో పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
-మేడెపల్లిలో పనులు పరిశీలించిన కలెక్టర్‌ శ్వేతామొహంతి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : మిషన్‌ భగీరథ పనులను ఎక్కడికక్కడ అసంపూర్తిగా వదిలేయొద్దని కలెక్టర్‌ శ్వేతామొహంతి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని మేడెపల్లి గ్రామంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను కలెక్టర్‌ పర్యవేక్షించా రు. ఇంత వరకు గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు రాకపోవడం, ట్యాంక్‌ నిర్మాణ పనులు, పైపుల లింకేజీ పను ల్లో జాప్యం, అర్థరహితంగా వదిలేసిన లీకేజీల పట్ల అసహనం వ్యక్తం చేశారు. గ్రామమంతా పర్యటించి పనుల పురోగతిని ఆరాతీశారు. 15 రోజుల్లోగా గ్రామానికి మిష న్‌ భగీరథ నీరు వచ్చేలా పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

గ్రామంలో హరితహారంలో భాగంగా చిన్న చిన్న మొక్కలు నాటారని, ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. రైతులందరూ తమ పొలం గెట్ల వెంట మొక్కలు నాటాలన్నారు. ఏ మొక్కలు కావాలం టే వాటిని నర్సరీల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పా రు. రైతుల డిమాండ్‌ మేరకు మొక్కలను సరఫరా చే యాల్సిందిగా అధికారులకు సూచించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగ్గా ఉండాలని, నిర్మించుకున్న మరుగుదొడ్డిని తప్పకుండా వినియోగించాలన్నారు. ప్లా స్టిక్‌ వాడకాన్ని నిషేధించి స్వచ్ఛతకు సహకరించాలని కో రారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, తాసిల్దార్‌ జె.కె.మోహన్‌, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, గ్రామస్తులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నాటిన మొక్కలను సంరక్షించాలి
పెబ్బేరు : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ సూచించారు. మం డలంలోని తోమాలపల్లి గ్రామంలో సర్పంచ్‌ అరుణ, ఉ ప సర్పంచ్‌ నరేందర్‌ రెడ్డిలతో కలిసి పర్యటించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులపై ఆరా తీ శారు. తడి, పొడిచెత్తలపై గ్రామ ప్రజలకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని తెలిపారు. హరితహారంలో భా గంగా నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామ సమీపంలో ఉన్న శ్మశానవాటికను పరిశీలించారు. శ్మశాన వాటికకు సమీపంలో జూరాల కాలువ ఉండటంతో ప్రాంగణమంతా ఊటనీటితో నిండిపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికకు గ్రామంలో ప్రభుత్వ భూమిని గుర్తించి నివేదిక ఇవ్వాలని తాసిల్దార్‌ ఘూన్సీరాం నాయక్‌ను ఆ దేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులున్నారు.

గ్రామాభివృద్ధికి పుష్కలంగా నిధులు
కొత్తకోట : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి వాటికి కంచె ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి సూచించారు. బుధవారం మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులు, హరితహారం మొక్కలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో నాటాల్సిన మొక్కలు గ్రామంలో నాటలేదని, లక్ష్యాన్ని పూర్తిచేయలేదని అసహనం వ్యక్తం చే శారు. నాటిన మొక్కలకు కంచె వేయలేదని, అవి పూర్తి గా ఎండిపోయాయని అన్నారు.

మొక్కలను సంరక్షించే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని అన్నా రు. ఎండిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి వాటికి కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ఇటీవల చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో అభివృ ద్ధి ఏ మాత్రం కనిపించడం లేదని, గ్రామ పంచాయతీ నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని వినియోగిం చుకోవాలని సర్పంచ్‌ లతకు సూచించారు. గ్రామాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచే సి అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో గణేశ్‌, డీపీవో రాజేశ్వరి, పంచాయతీ రాజ్‌ ఏఈ రాములు, తాసిల్దార్‌ రమేశ్‌రెడ్డి, ఎంపీడీవో కతలప్ప, ఎంపీవో సుదర్శన్‌, అధికారులు తదితరులున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...