కస్తూర్బాలో కూలిపోయిన వాటర్‌ ట్యాంకు


Thu,December 5, 2019 12:42 AM

ధన్వాడ : ధన్వాడ కస్తూర్బాలో బుధవారం వాటర్‌ ట్యాంకర్‌ కూలిపోయి అందులో పని చేస్తున్న వర్కర్‌ దాసరి పద్మమ్మ (40) మృతి చెందింది. కస్తూర్బాలో మధ్నాహ్న భోజనం ముగించికొని విద్యార్థినులు తరగతి గదిలోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే వాటర్‌ ట్యాంకర్‌ కూలి పోయింది. అక్కడే ఉన్న కస్తూర్బా వర్కర్‌ దాసరి పద్మమ్మపై ఒక్కసారిగా ట్యాంకు శిథిలాలలు ఆమెపై పడ్డాయి.

హాస్టల్‌ సిబ్బంది ఆమెను అతి కష్టంమీద శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. హుటహుటిన చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. జరిగిన సంఘటన తెలుసుకొని డీసీడీవో ధన్వాడ కస్తూర్బాను సందర్శించి సంఘటన గురించి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేవైఎం నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు బాల్‌చందర్‌, ఏబీవీపీ నాయకులు కురుమూర్తి, రామన్‌గౌడ్‌లు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసు కొని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం నారాయణపేట దవా ఖానకు తరలించారు. ఎంపీడీవో శశికళ, మండల ప్రత్యేకాధికారి యాదయ్య, ఈవోపీఆర్డీ వేణుగోపాల్‌ సందర్శించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...