11న మంత్రి కేటీఆర్‌ రాక


Thu,December 5, 2019 12:41 AM

-పాన్‌గల్‌లో డబుల్‌బెడ్‌రూం నిర్మాణాలకు శంకుస్థాపన
-జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌
-హెలీప్యాడ్‌, ఇండ్ల నిర్మాణ స్థల పరిశీలన
పాన్‌గల్‌ : మండలకేంద్రానికి 78 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేయడానికి ఈ నెల 11వ తేదీన జిల్లాకు మంత్రి కేటీఆర్‌ రానున్నట్లు జేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఈ క్రమంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం మండలకేంద్రంలోని సర్వే నెంబర్‌ 58లో ఉన్న రెండెకరాల పట్టా భూమిని బుధవారం జేసీ, పంచాయతీరాజ్‌ ఈఈ శివకుమార్‌ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.

హెలీప్యాడ్‌ దిగేందుకు అనువైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం, మండల మహిళా సమాఖ్య ముందున్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, నాయకులు దశరథ్‌నాయుడు, బ్రహ్మం, తాసిల్దార్‌ శ్రీరాములు, ఏఈలు సత్యం, విద్యాసాగర్‌రెడ్డి, విండో సీఈవో భాస్కర్‌గౌడ్‌, ఆర్‌ఐ శంకర్‌, వీఆర్వో చంద్రమోహన్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌రోడ్డును పరిశీలించిన జేసీ
వనపర్తి రూరల్‌ : మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నూతనంగా నిర్మాణమవుతున్న మార్కెట్‌ మెయిన్‌ రోడ్డు పనులను బుధవారం జేసీ పరిశీలించారు. నూతన మార్కెట్‌ అనుసంధానంగా మెయిన్‌ రోడ్డు నుంచి మార్కెట్‌కు రోడ్డును వేసేందుకు కొంత మంది రైతులు తమ భూమిని మార్కెట్‌ శాఖకు అప్పగించారన్నారు. దానికి బదులుగా మార్కెట్‌లో మరో చోట రెవెన్యూశాఖ ఇచ్చిన భూమిని మార్కెట్‌ యార్డు కన్వవర్షన్‌ చేసేందుకు తాసిల్దార్‌తో కలిసి రోడ్డును పరిశీలించారు. రికార్డు పరంగా పూర్తి వివరాలను సేకరించి తదుపరి చర్యలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...