విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని చదవాలి


Thu,December 5, 2019 12:40 AM

-జిల్లా 9వ అదనపు జడ్జి శ్రీనివాసులు
కొత్తకోట : విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొ ని చదవాలని జిల్లా 9వ అదనపు జడ్జి శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నివేదిత కళాశాలలో ‘చట్టాల ప్రాముఖ్య త, సమాజంలో విద్యార్థుల పాత్ర’ అనే అంశాలపై ప్రముఖ న్యాయవాదులతో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచంలో మంచి పుస్తకాలే స్నేహితులని, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని అన్నా రు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. స్త్రీ వివక్ష లింగనిర్దారణతో మొదలై ర్యా గింగ్‌, వరకట్నం, మైనర్‌ వివాహాలు తదితర వాటిపై వివక్ష జరుగుతుందని గుర్తుచేశారు. వి నియోగదారులు వినిమయ చట్టం, పేదరికంలో ఉన్నవారికి న్యాయసేవాధికార సంస్థ, లోక్‌ అదాలత్‌ ద్వారా జరిగే న్యాయంపట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు మోహన్‌కుమార్‌, శ్రీనివాసాచారి, ఉత్తరయ్య, రాములుయాదవ్‌, వెంకటేశ్వరమ్మ, దినేశ్‌రెడ్డి, నిరంజన్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...