పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలి


Thu,December 5, 2019 12:39 AM

-బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి
-డీఈవో సుశీందర్‌రావు, డీఎస్పీ కిరణ్‌కుమార్‌

వనపర్తి విద్యావిభాగం : పది రోజుల్లో బడిబయటి పిల్లలను గుర్తించే సర్వేను పూ ర్తి చేయాలని, బడిబయటి పిల్లలను గుర్తిం చి బడిలో చేర్పించాలని డీఈవో సుశీందర్‌రావు, డీఎస్పీ కిరణ్‌కుమార్‌ సూచించా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఈవోలు, సీఆర్పీలతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 14 ఏండ్లలోపు బాలబాలికలందరినీ బడిలో చేర్పించాలని, హోటళ్లు, కిరాణ దుకాణ సముదాయాల్లో, ఇతరత్ర చిన్నతరహా పరిశ్రమల్లో బాలకార్మికులు పనిచేస్తే గుర్తించాలన్నారు. అట్టి యజమానిపై కార్మికుల యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేయాలని సూ చించారు. పది రోజల్లో అన్ని మండలాల్లో ఎంఈవో పర్యవేక్షణలో సర్వేను పూర్తి చేసి కచ్చితమైన రిపోర్ట్‌ను సేకరించి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవో చంద్రశేఖర్‌, గణేశ్‌, ఏపీవో శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...