ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించాలి


Tue,December 3, 2019 12:28 AM

వనపర్తి వైద్యం : ఎయిడ్స్ నివారణపై అవగాహన క ల్పించాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌డ్డి తెలిపారు. డీఎంహెచ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ ని వారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బా లుర జూనియర్ కళాశాల మైదానం నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఎయిడ్స్ హెచ్‌ఐవీ సోకిన వారిలో మనోధైర్యాన్ని నింపాలని, గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పకుండా చేయించాలని కోరారు. పాజిటివ్‌గా గుర్తించిన గర్భిణులకు క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులను వాడేలా, ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు.

వనపర్తి జిల్లా దవాఖానలో ఏఆర్‌టీ మందులు ఉచితంగా పం పిణీ చేస్తున్నారన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సీడీ 4 పరీక్షలు చేస్తారు. ఏడాదికోసారి వైరల్ లాడో పరీక్షలు చేస్తారని, ప్రతి జిల్లా కేంద్రంలో సురక్ష క్లినిక్ ఉంటుందని, ఈ కేంద్రంలో సుఖవ్యాధుల గురించి పూర్తి సమాచారం ఇస్తారని, పరీక్షల ముందు, తర్వాత సలహాలు, సూచనలు చేస్తారని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి 1000 మందిలో ఏడురురికి హెచ్‌వీఐ సోకిందన్నారు. రెండు రోజుల కిందట ఎయిడ్స్‌పై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్షికమంలో ఎంపీపీ కిచ్చాడ్డి, అసిస్టెంట్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రవిశంకర్, ఆర్‌ఎంవో చైతన్య గౌడ్, రెడ్‌క్షికాస్ సొసైటీ చైర్మన్ ఖుతుబుద్దీన్, డా క్టర్ మురళీధర్, శ్రీనివాసులు, మద్దిలేటి, వెంకటయ్య, భిక్షపతి, చంద్రయ్య, నర్సింహారావు, చెన్నమ్మ థామస్, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...