ప్రతి చెరువుకూ..సాగునీరు


Mon,December 2, 2019 12:21 AM

-ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా
-యాసంగికి పుష్కలంగా ఉన్న నీరు
-వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-అలుగుపారిన హన్మండ్ల చెరువుకు పూజలు

వనపర్తి రూరల్‌ : నియోజకవర్గంలోని అనువైన ప్రతి చెరువును నింపేందుకు కృషి చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని రాజపేట గ్రామ శివారులో ఉన్న హ న్మండ్ల చెరువు కృష్టమ్మ నీటితో అలుగుపారడంతో మం త్రి గ్రామస్తులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భం గా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలోనే ఈ చెరువుకు నీళ్లు అందిస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. హన్మండ్ల చెరువు ఎంజీకేఎల్‌ఐకు చివరి చెరువుగా ఉన్నదన్నారు. గతంలో రైతులకు ఈ చెరువు కు నీళ్లు వస్తాయో, రావో అని అనుకున్నారని, అటువంటిది, పాటు కాల్వలను సరిచేసి నీళ్లు తీసుకుని వచ్చామ ని చెప్పారు. ఈ నీటితో యాసంగి పంట సాగు చేయడానికి అవకాశం ఏర్పండిందని తెలిపారు. ఆనాటి కాలంలోని చెరువులు మొత్తం ఒకదానికొకటి అనుసంధానం గా ఉండటంతో కొంత మేర సులువుగా ప్రతి చెరువును నింపుకోవడానికి వీలుకలిగిందన్నారు. నల్లచెరువును నింపడంతో రాజనగరం చెరువు అలుగుపారి ఒక వైపు జగత్‌పల్లి, మరోవైపు రాజపేట గ్రామ చెరువులకు నీరు చేరుతుందన్నారు. ఈ చెరువులు నిండి మళ్లీ తిరిగి శంకరసముద్రానికి వెళ్లడంతో నీటి వృథా లేదన్నారు. ఈ ఏ డాది యాసంగి పంటకు కూడా సాగు నీటి కొరత ఉండదని తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభు త్వం మద్దతు ధర కల్పిస్తుందని, దానికి రైతులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్‌ జ్యోతి, పెద్దతండా సర్పంచ్‌ జయరాములు, గొర్రెల పెంపకదారుల సంఘం చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వి ష్ణుయాదవ్‌, నాయకులు సుదర్శన్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, వే మారెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రైతులు తది తరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...