వాల్మీకి ఉద్యోగులకు సన్మానం


Mon,December 2, 2019 12:19 AM

వనపర్తి టౌన్‌ : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూపు-2లో ఉద్యోగాలు పొందిన వాల్మీకిలను వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా వాల్మీకి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణయ్య, బుడ్డన్నలు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా 15 మంది వాల్మీకిలు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా యువకులు కూడా స్ఫూర్తితో బాగా చదవాలని కోరారు. ఉద్యోగం సాధించిన వారు వృత్తి ధర్మాన్ని పాటించి విధుల్లో సమన్యాయం, వృత్తికి న్యాయం చేసి ప్రశంసలు పొందాలని సూచించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన వారిని శాలువా, పూలమాల ప్రతిభ పురస్కారాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు ఆశోక్‌కుమార్‌, నాయకులు డీ నారాయణ, వేణుగోపాల్‌నాయుడు, రాంమూర్తినాయుడు, నీలస్వామి, తిరుమల్‌, వెంకటరమణ, దేవన్న, బాలస్వామి, రాములు, రవి, అరవింద్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...