బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు


Sat,November 30, 2019 01:21 AM

మరికల్ : తమ బంధువుల అంత్యక్షికియలకు వెళ్తుండగా రోడ్డుపైకి జింక అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి భాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాధ్వార్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన భార్యా పిల్లలతో కలిసి ఊట్కూర్ మండలంలోని మగ్దుం పూర్‌లో తమ బంధువుల అంత్యక్షికియలకు వెళ్తున్నారు.

మండల కేంద్రానికి సమీపంలో రోడ్డుపైకి జింక అకస్మాత్తుగా అడ్డురావడంతో బైక్ అదుపు తప్పింది. దీంతో శ్రీనివాసులుతో పాటు బైక్‌పై ఉన్న సుప్రియ, గణేశ్‌లకు తీవ్రగాయలయ్యాయి. వీరికి మండల కేంద్రంలోని ప్రైవేటు దవాఖానలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం 10లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధితుడు తెలిపారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...