మాజీ డిప్యూటీ డీఈవో అనంతరామశర్మ మృతి


Sat,November 30, 2019 01:20 AM

కొల్లాపూర్ టౌన్ : పట్టణానికి చెందిన విద్యావేత్త, ఉమ్మడి జిల్లా మాజీ ఉప విద్యాశాఖాధికారి పల్లా అనంతరామశర్మ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం సలహాదారులుగా చాలా సంవత్సరాల పాటు పని చేశారు. స్థానిక ఆర్‌ఐడీ ప్రభుత్వ పాఠశాల, ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేశారు.

కొల్లాపూర్ విద్యాశాఖాధికారిగా, డిప్యూటీ డీఈవోగా పని చేస్తూ విద్యాశాఖాబివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. ఉద్యోగ జీవితంలో అక్షరాస్యతను పెంపొందించేందుకు శాయశక్తులా కృషి చేసి ప్రభుత్వపరంగా పలు అవార్డులను ఆయన పొందారు. ఆయన మృతి పట్ల పలువురు ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, అధికారులు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...