సజావుగా ప్రయాణం


Sat,November 16, 2019 12:23 AM

-సురక్షితంగా బస్సులు నడుపుతున్న యాజమాన్యం
-72 ఆర్టీసీ, 21 అద్దెబస్సులు
-42వ రోజూ కొనసాగుతున్న తాత్కాలిక సిబ్బంది
-రూ.10లక్షల11వేల ఆదాయం
వనపర్తి టౌన్ : ఆర్టీసీ సమ్మె శుక్రవారం 42వ రోజుకు రోజుకు చేరినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతుంది. శుక్రవారం మొత్తం 93 బస్సులు నడువగా అందులో 72 ఆర్టీసీ, 21 అద్దె బస్సులను నడిపింది. కార్తీక మాసం, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తమ తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్సులను ఆశ్రయించడంతో బస్టాండ్ కిక్కిరిసింది. బస్టాండ్ ప్రాంగణం, ప్లాట్‌ఫాంల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండ్‌కు చేరుకోవడంతో రద్దీ నెలకొంది. సమ్మెలేని సమయంలో బస్సులు ఏవిధంగా నడిచాయో సమ్మె కొనసాగుతున్నప్పటికీ బస్సులు యథావిధిగా నడిపిస్తు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అదేవిధంగా గురువారం ఒక్కరోజే రూ.10.11లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ గడించినట్లు డీఎం దేవదానం తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగకుండా పటిష్ఠమైన బందోబస్త్, పికెటింగ్ పోలీసులు చేపట్టారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...