పూర్తిస్థాయి రిపోర్ట్‌ను పొందుపరచాలి


Sat,November 16, 2019 12:21 AM

వనపర్తి టౌన్ : జిల్లాలో పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలు, రైటర్లు ఇంటరాగేషన్ రిపోర్ట్‌ను పూర్తిస్థాయి వివరాలను పొందుపరచాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. శుక్రవారం ఒక్కరోజు శిక్షణలో ఆమె మాట్లాడుతూ నిందితులను అరెస్ట్ చేసేటప్పుడు ఇంటరాగేషన్ రిపోర్ట్‌లో నిందితుల యొక్క పూర్తి వివరాలు సేకరించి టీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో ఎంట్రీ చేసి క్వాలిటీ డాటాను నమోదు చేయాలని అన్నారు. డాటా బేస్ ద్వారా ఎన్నో కేసులు చేదించవచ్చని, రాబోవు తరాల వారికి డాటా ఎంతో ముఖ్యమని, ఏ చిన్న తప్పిదం లేకుండా డాటా ఎంట్రీ చేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రాపర్టీ సైబర్, పైనాన్షియల్, గుట్కా, మర్డర్, రాబరీ, డేకాయసి, పోక్సో, కమ్యునల్ ఇతర స్థలాలలో ఇంటరాగేషన్ తప్పకుండా రాయాలని సూచించారు. నిందితులు వాడిన వాహనాల సమాచారం, వారి డిజిటల్ ప్యూచర్స్, ఎకానమికల్ ప్యూచర్స్, ప్యామిలీ హిస్టరీ, నేరం చేసిన సమయం, నిందితుడు తరుచుగా సందర్శించిన ప్రదేశాలు తదితర అంశాలపై క్లుప్తంగా రాయాలని చెప్పారు.

నేరం చేసిన ప్రతిసారి ఇంటరాగేషన్ రిపోర్ట్ రాయాలని తెలిపారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వేస్టిగేషన్ ఉన్నప్పుడే శిక్షలు పడతాయని, నేరస్తులకు శిక్షలు పడినప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని, ప్రజలు ఎంతో ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారని అన్నారు. కోర్టు, పోలీస్ విభాగాలను అనుసందానం చేయడం ద్వారా త్వరితగతిన కోర్టులలో కేసులను పరిష్కరించడంతో పాటు బాధితులకు సత్వరమే న్యాయం కల్పించడం కోసం ఐసీజేఎస్‌ను రూపొందించబడడం జరిగిందని ఆమె గుర్తుచేశారు. ఇన్వేస్టిగేషన్‌లో సమయం ఆధా, పోలీస్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఐసీజేఎస్ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణలో వనపర్తి అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్, కొత్తకోట సీఐ వెంకటేశ్వర్‌రావు, ఆత్మకూర్ సీఐ సీతయ్య, జమ్ములప్ప, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, రైటర్లు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...