కొత్తకోట మున్సిపాలిటీలో


Sat,November 16, 2019 12:21 AM

-15 రోజుల కార్యాచరణ ప్రణాళిక
- నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలెక్టర్ చర్చ
వనపర్తి,నమస్తే తెలంగాణ : కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో త్వరలోనే 15 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు కలెక్టర్ శ్వేతామొహంతి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే, కలెక్టర్‌ను ఆమె చాంబర్‌లో కలిసి వనపర్తి జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గ సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండలాల్లో డబుల్‌బెడ్రూం ఇండ్లు, ట్రాక్టర్ల పంపిణీ, పాడుబడిన ప్రభుత్వ భవనాల పరిశుభ్రత, కొత్తకోట మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం, మిషన్ భగీరథ పైపుల కారణంగా పాడైన రోడ్ల మరమ్మతులు, తదితర అంశాలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొత్తకోట మున్సిపాలిటీలో త్వరలోనే 15రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభిస్తామని, రహదారులు, మురికి కాలువలు శుభ్రం చేయడం, ఖాళీ స్థలాలను శుభ్రపరచడం, పడిపోయిన ఇండ్లను తొలగించటం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.

ఈనెల 19న కొత్తకోట మున్సిపాలిటీలో అన్ని వార్డులో పర్య టించి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్తకోట పట్టణంలో పందుల సమస్యను తొలగించాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా, ఈ నెల 16న పందుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేయాలని తాసిల్దార్ శంకర్‌ను ఆదేశించారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గంలో మండలాల గొర్రెల కాపరుల కోసం కొత్తకోటలో స్థలాన్ని కేటాయించాలని, నిల్వడి గ్రామానికి ఎల్‌ఈడీ బల్బులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, అజ్జకోలు కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, బాల నారాయణ ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles