చేరువలోనే కొనుగోళ్లు


Fri,November 15, 2019 02:36 AM

-రైతులకు అందుబాటులో కేంద్రాలు
-దళారుల చేతుల్లో మోసపోకుండా చర్యలు
-నేరుగా ఖాతాల్లోనే జమ
-ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి రూరల్/గోపాల్‌పేట/ఖిల్లాఘణపురం : రైతులకు చేరవలోనే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి మండలంలోని మార్కెట్ యార్డు, పెద్దగూడెం, చిట్యాల, చీమనగుంటపల్లి, గోపాల్‌పేట మండలకేంద్రంలోని కోదండరామస్వామి ఆలయ ఆవరణలో, ఖిల్లాఘణపురం, సోలీపూర్‌లలో డీఆర్డీఏ, ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ సంఘాల ద్వారా ఏ ర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి, కలెక్టర్ శ్వేతామొహంతి ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైనన్ని వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మే రకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారన్నారు. అన్నదాతకు అసౌక్యరం కలగకుం డా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వానాకాలం సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రే డ్ ఏ ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1835 మద్దతు ధర చెల్లించి కొంటున్నామన్నారు. రైతులకు ఇ బ్బందుల్లేకుండా ముందుగానే సంబంధిత శాఖల అధికారులతో వీసీ, సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో పండించిన ధా న్యాన్ని మనవద్ద అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇలాంటి వాటిని అరికట్టేందుకు రైతులు, వారు పండించిన పంటల వివరాలతో కూడిన డేటాబేస్ సిద్ధంగా ఉందని, ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తే తెలిసిపోతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. జిల్లాలో 111 కేంద్రాలకు ప్రభుత్వం అనుమతించిందని, రైతుల డిమాండ్‌ను బట్టి వీటి సంఖ్య మరింత పెరగవచ్చన్నారు. కొన్న ధాన్యాన్ని 50 మిల్లర్లకు తరలించేందుకు అనుమతించిందన్నారు. ధాన్యాం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతాయన్నా రు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గిం జనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ధా న్యాన్ని అమ్మిన రెండు, మూడు రోజుల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. ఎక్క డ చూసినా పంటలు పచ్చగా కనిపిస్తున్నాయన్నా రు. రైతులు ఎప్పుడూ ఒకే పంటను సాగు చేయకుండా కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడి రాబట్టుకోవచ్చని అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు రోజు కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి పర్యవేక్షిం చి రోజువారి వివరాలను వాల్సప్ ద్వారా తనకు పంపించాలని సూచించారు. దీనిని కచ్చితంగా అమలు చేయాలన్నారు. 1010 రకం ఏ గ్రేడ్ క్వింటాల్‌కు రూ.1835, బీ గ్రేడ్‌కు రూ.1815 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. వరిలో 14 శాతం తేమ ఉండేలా చూసుకోవాలని కోరారు.

ధాన్యం తీసుకువచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంక్ అకౌంట్ పాసు పుస్తకం జీరాక్స్‌లను వెంట తీసుకురావాలని సూచించారు. అంతకుముందు పెద్దగూడెం గ్రామంలోని టీఆర్‌ఎస్ కార్యకర్త వివాహానికి హా జరై నూతన వధూవరులను ఆశ్వర్వదించారు. అ లాగే చిమనగుంటపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.22.500 వేల చెక్కును పి.సంధ్య కు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చై ర్మన్ లోకనాథ్‌రెడ్డి, డీఆర్‌డీవో గణేశ్, మార్కెటింగ్ ఏడీ స్వర్ణసింగ్, పౌరసరఫరాల జిల్లా అధికారిణి రేవతి, జిల్లా మేనేజర్ లక్ష్మయ్య, ఎంపీపీలు కిచ్చారెడ్డి, కృష్ణనాయక్, సంధ్య, ఆర్డీవో చంద్రారెడ్డి, జె డ్పీటీసీలు జెడ్పీటీసీ సామ్యనాయక్, భార్గవి, సింగిల్‌విండో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి ఖిల్లా మండలాఅధ్యక్షుడు వెంకట్రావు, మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సర్పంచులు వెంకటరమణ, రాము, ఆంజనేయులుగౌడ్, బాల్‌రెడ్డి, ఎంపీటీసీలు వాణి, ఆశాజ్యోతి, గోపాల్‌పేట వైస్‌ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, కో ఆప్షన్ సభ్యుడు మతీన్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ తిరుపతి యాదవ్, గ్రామ అధ్యక్షుడు మణ్యంనాయక్, మండలాధ్యక్షుడు బాల్‌రాజు, తాసిల్దార్ రాధాకృష్ణ, ఏపీడీ రేణుక, డీపీఎం అరుణ, ఏపీఎం సావిత్రి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరిత, గ్రామ సంఘం అధ్యక్షురాలు చెన్నమ్మ, ఏ ఈవోలు పవన్‌కల్యాణ్, నాగరాజు, టీఆర్‌ఎస్ నా యకులు లకా్ష్మరెడ్డి, బాలీశ్వర్‌రెడ్డి, రాజు, పురేందర్‌రెడ్డి, రమేశ్, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...