ఉత్సాహంగా బీచ్ వాలీబాల్ జట్ల ఎంపిక


Thu,November 14, 2019 12:00 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ బీచ్ వాలీబాల్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా అండర్-14,17 జట్ల ఎంపికలను బుధవారం జిల్లా కేంద్రంలోని స్టేడియంలో నిర్వహించారు. ఈ ఎంపికలను ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర బీచ్ వాలీబాల్ టోర్నీలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సహాయ కార్యదర్శి వేణుగోపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు వడెన్న, జాన్సన్, విక్టర్ పాల్, రామేశ్వరయ్య, శ్రీనివాసులు, బాలు, అరుణ, అనంతసేన, రాజు, మమత తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...