అందరూ ఆధ్యాత్మిక అభిలాషను పెంపొందించుకోవాలి


Thu,November 14, 2019 12:00 AM

-హంపీ జగద్గురువు విద్యారణ్యస్వామి
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అభిలాషను పెంపొందించుకోవాలని హంపీ జగద్గురువు విద్యారణ్యస్వామి అభిలషించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల అయ్యప్ప గుట్టపై నూతనంగా నిర్మించిన శివమార్కండేయ దేవాలయంలో నిర్వహించిన కార్తీక పూజలకు జగద్గురువు శంకరాచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధీశులు విద్యారణ్యభారతి మహస్వామి విచ్చే అనుగ్రహ భాషణం చేశారు. ఆంగ్లంలో గాడ్ అంటే త్రిమూర్తులని, లోకంలో ప్రత్యక్ష దైవాలు నాలుగు అని, అవి తల్లి, తండ్రి, సూర్యుడు, నాగరాజు అని పేర్కొన్నారు. వీరిని అందరూ ప్రసన్నం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని తెలియజేశారు. నేటి సమాజంలో అందరూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సతమతానికి ముగింపు పలకాలంటే శాంతియుతంగా ఉండడమేనని పేర్కొన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందు లేసి రాత్రి తొందరగా పడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావన్నారు. డబ్బులతో ఆరోగ్యాన్ని ఎప్పటికీ కొనలేమనే విషయాన్ని అందరూ అవగతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా అనందంగా జీవించాలన్నారు. అప్పుడు నిండు నూరేళ్లు తమ జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. అంతకుముందు ప్రముఖ వేద పండితులు రాఘవశర్మ శివమార్కండేయుడికి కార్తీక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎంవీ ప్రభాకర్‌రావు, డాక్టర్ పానుగంటి బాలరాజు, బాస రామస్వామి, సూరప్రతాప్, బిజ్జశంకర్, ఒగ్గుబాలరాజు, భీంపల్లి శ్రీకాంత్, సత్యానారాయణ, దాసు వెంకటేశ్, పల్లాటి నాగస్వామి, కించె శుభాశ్ చంద్రబోస్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...