పరస్పర సహకారంతో కేసుల పురోగతి


Wed,November 13, 2019 11:59 PM

మహబూబ్‌నగర్ లీగల్ : న్యాయమూర్తులు-న్యాయవాదుల పరస్పర సహకారంతో కేసులను పురోగతి దిశగా తీసుకువెళ్లవచ్చని, మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయవాదుల సహకారం చక్కగా ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.వి.సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీపై రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా వెళుతున్న సందర్భంలో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జీవీ సుబ్రమణ్యం మాట్లాడారు. ఇక్కడ పని చేసిన 9 నెలల కాలంలో న్యాయ వాదుల సహకారంతో పని చేయడం జరిగిందని చెప్పారు.

ఇక్కడి నుంచి వెళ్లడానికి అయిష్టంగా ఉన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో వెళుతున్నానని అన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ బార్-బెంచ్ మధ్య సత్సంబంధాలను కొనసాగించడానికి న్యాయవాదులు ఎల్లవేళలా ముందుంటారని అన్నారు. అలాగే ఇక్కడ పని చేసేందుకు వచ్చిన, ఉన్నటువంటి న్యాయమూర్తుల సహకారం కూడా ఎంతో గొప్పదన్నారు. జిల్లా న్యాయమూర్తి బదిలీపై వెళుతుండటం కొంత బాధగా ఉన్నా ఉద్యోగ బాధ్యతలలో బదిలీలు తప్పనిసరి అన్నారు. అనంతరం న్యాయమూర్తిని బార్ అసోసియేషన్ కార్యవర్గం సత్కరించింది. వారితోపాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయమూర్తికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రఘురాం, చంద్రశేఖర్‌రావు, దీప్తి, కార్తీక్, డీఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి ఎన్.వెంకట్రాంలతో పాటు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజ భాస్కర్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, సీనియర్ న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, పుల్లయ్య, ప్రతాప్ కుమార్, జిల్లా కోర్టు పీపీ బాలం గంగాధర్‌రెడ్డి, జీపీ విజ్ఞానేశ్వర్‌రెడ్డి, పీపీలు ఉమామహేశ్వరి, పుట్టపాగ రఘుపతి, విక్రందేవ్, స్వదేశ్, బార్ కార్యవర్గ సభ్యులు రాజుగౌడ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...