ప్రతి గింజనూ కొంటాం


Wed,November 13, 2019 02:58 AM

వనపర్తి రూరల్‌ : రాష్ట్రంలో రైతులు పండించి న ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డ్‌లో మెప్మా ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మా ట్లాడుతూ ప్రతి పంటకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దానికి రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత రైతులదే అని అన్నారు. ప్రతి రైతు మో ముపై చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ ల క్ష్యమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే పండిన పంటలన్నింటినీ మద్దతు ధరకు కొంటున్నామన్నారు. పక్క రాష్ర్టా ల్లో ఈ పరిస్థితి లేదని, దీన్ని అవకాశంగా తీసుకు న్న దళారులు అక్కడ కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, దీనిని అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల చెక్‌ పోస్టులపై ప్రత్యేక నిఘాను ఏర్పా టు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం 25 నుంచి 30 శాతం పంటలను మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం మా త్రం కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా 100 శాతం పంటలను మద్దతు ధరకు కొంటున్నామన్నారు. ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు ఎలాం టి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు ధాన్యాన్ని ఒ క్కసారిగా మార్కెట్‌కు తీసుకురాకుండా, నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అకాలంగా వచ్చే వర్షాల నుంచి ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీ సుకోవాలన్నారు. గ్రామాల వారీగా వేసిన పం టలు, దిగుబడి వివరాలను వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారుల నుంచి సేకరించి అందుబాటులో ఉంచుకోవాలని మార్కెట్‌ అధికారులకు సూచించారు. రానున్న 50 రోజులు మార్కెటింగ్‌ శాఖ అ ధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తూ కాలు తదితర విషయాల్లో రైతులను ఇబ్బందుల కు గురిచేయొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. అనంత రం మార్కెట్‌ యార్డులో రైతులను పలకరించి, పండించిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రె డ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్‌ లక్ష్మయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమేశ్‌గౌ డ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గట్టు యాదవ్‌, నాయకులు శ్రీధర్‌, కృష్ణ, తిరుమల్‌, శ్యాంకుమా ర్‌, రహీం, పరంజ్యోతి, లక్ష్మీనారాయణ, బీచుపల్లియాదవ్‌, మురళీసాగర్‌, యాదగిరి, శ్రీనివాసు లు, డానియల్‌, శివ, డీఎస్‌వో రేణుక, ఏవో కురుమయ్య, బాలీశ్వరయ్య, సుబ్బయ్య ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles