96 బస్సులతో రాకపోకలు


Wed,November 13, 2019 02:55 AM

వనపర్తి విద్యావిభాగం : ఆర్టీసీ సమ్మెలో భాగంగా మంగళవారం వనపర్తి డిపో లో మొత్తం 96 బస్సులతో ఆర్టీసీ యాజమాన్యం రాకపోకలను సాగించింది. సమ్మె ఒకవైపు కొనసాగుతున్న యథావిధిగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రయాణాలు సాఫీ గా సాగేలా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అందుబాటులో ఉంచింది. ఒకవైపు, పెండ్లిళ్లు, ఫంక్షన్లు ఉండడంతో తమ బంధువుల కార్యాలయలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రజలు బస్టాండ్‌ ప్రాంగణానికి తరలిరావడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సులను అందుబాటులో ఉంచి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. డిపో, బస్టాండ్‌, రాజీవ్‌చౌరస్తా, గాంధీచౌక్‌ ప్రాంతాలలో పోలీస్‌ పికెటింగ్‌ నిర్వహించి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అన్ని డిపోల కంటే అత్యధికంగా రావాణాను కొనసాగిస్తు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 74 ఆర్టీసీ, 22 అద్దె బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడిపించి మంచి ఆధాయాన్ని గడిస్తు అగ్రస్థానంలో వనపర్తి డిపో నిలిచింది. ప్రతిరోజు రూ.9.5లక్షల నుంచి మొదలుకొని రూ.11.5లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అందు లో భాగంగా సోమవారం ఒక్కరోజు రూ.11.11లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ యాజమాన్యం గడిచింది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...