ఆర్డీవో కార్యాలయ ముందు కడుకుంట్ల గ్రామస్తుల నిరసన


Tue,November 12, 2019 04:12 AM

వనపర్తి రూరల్ : మండలంలోని కడుకుంట్ల గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో చంద్రారెడ్డి వారి తన చాంబర్లోకి పిలిచి మాట్లాడారు. గ్రామస్తులు ఆర్డీవోకు వివరిస్తు 20 ఎండ్ల కిందట ఆనాటి ప్రభుత్వం తమ గ్రామ శివారులో ఇండ్ల స్థలాలు లేని వారికి పాట్లు మంజూరు చేసిందని, కాని వాటికి హద్దులు చూపలేదని తెలిపారు. ఆనాటి నుంచి ఇంతవరకు దాని సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు వివరించారు. వాటిని త్వరలో గ్రామంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులతో, గ్రామస్తులతో కలిసి సమస్య పరిష్కారించేందుకు కృషి చేస్తామని ఆర్డీవో అన్నారు. రాజ సముద్ర చెరువులో తమ గ్రామానికి చెందిన దాదాపు 200 ఎకరాల సాగు భూములు నీట మునిగి పోయాయని వాటికి నష్టపరిహారం అందించేలా చూడాలని గ్రామస్తులు కోరాగా, పాతకాలం నాటి చెరువుల కింద మునిగిన భూములకు ఎటువంటి నష్టపరిహారం రాదని ఆర్డీవో తెలిపారు. నిరసన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles