దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు


Tue,November 12, 2019 04:12 AM

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దని ఇన్‌చార్జి జేసీ వెంకటయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన ప్రజల ద్వారా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పర్యవేక్షణ జరపాలన్నారు. ఫిర్యాదును బట్టి సమయం తీసుకోవాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచరాదన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోలీస్ ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు
వనపర్తి టౌన్ : ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు అందాయని ఎస్పీ అపూర్వరావు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీని కలిసి విన్నవించారు. 4 భూమి, రెండు భార్యాభర్తలు, రెండు ఇతర తగాదాలు వచ్చాయని, పరిష్కారానికి కృషి చేయాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...