శ్రీశైలం : శ్రీశైల ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం ఈగలపెంట కృష్ణవేణి అతిథి గృహానికి చేరుకున్న ఆయన సాయంత్రం జలవిద్యుత్ కేంద్రంలో పర్యటించారు. చీఫ్ ఇంజనీర్ మంగేశ్ కుమార్ మంత్రికి విద్యుత్ కేంద్రంలోని అన్ని విభాగాల పని తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల వల్ల నిండుకుండలా మారిన రిజర్వాయర్ ద్వారా అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినట్లు వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ తెలంగాణ రాష్ర్టానకే ఆదర్శనీయంగా పేరుతెచ్చుకున్న అధికారులను సిబ్బందిని అభినందించారు. జలవిద్యుత్ కేంద్రలో మంత్రి వెంట విద్యుత్ సౌధ చీఫ్ ఇంజనీర్ సురేశ్, ప్రాజెక్ట్ ఎస్ఈ మురళీధర్, సివిల్ ఈఈ శ్రీనివాసరావు, ఏడీసి, డీఈ, ఏఈలతోపాటు ఏఐటీయూసీ అనుబంధ సంస్థ నాయకులు బండారి లక్ష్మయ్యలు పాల్గొన్నారు.
శ్రీశైలంలో మంత్రి దంపతుల పూజలు
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కుటుంబ కలిసి దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వచ్చిన వారు శ్రీకృష్ణదేవరాయ గోపురం నుంచి ఆల ప్రవేశం చేయగా ఆలయ అధికారులు వేదపండితులు ఘన పలికారు. వెంట ఆలయ అధికారులు ఉమేశ్ పఠ్వారీలు ఉన్నారు.